- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్
రాష్ట్రంలో రాగల వారం రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల వారం రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీ సెల్సియస్ ల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు రోజులు ఆదిలాబాద్, జగిత్యాల, కుమరం భీం, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.






