- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం!

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు (rain forecast) ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేరకు శనివారం వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతోందని, సాయంత్రం వరకు ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నగరంలో నిన్నటితో పోలిస్తే నేడు వర్ష తీవ్రత తక్కువగానే ఉందని ఎక్స్ వేదికగా తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్ పరిధిలోని ఘట్‌కేసర్, కీసర, దమ్మాయిగూడ బెల్ట్ వద్ద ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపారు. కాప్రా, సైనిక్ పురి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చెర్లపల్లి, నారపల్లి, బోడుప్పల్, నేరేడ్‌మెట్, యాప్రాల్ ప్రాంతాల్లో వచ్చే 2గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ప్రభావం అవకాశం ఉందని తెలిపారు.