Messi: కోల్‍కతాలో గందరగోళం.. రేవంత్ Vs మెస్సీ మ్యాచ్‍పై పోలీసుల అలర్ట్

by Prasad Jukanti |   (  Updated:2025-12-13 08:45:25  IST  )

కోల్‍కతా గందరగోళం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Messi: కోల్‍కతాలో గందరగోళం..  రేవంత్ Vs మెస్సీ మ్యాచ్‍పై  పోలీసుల అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) కోల్‍కతా పర్యటనలో ఉద్రిక్తత నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. మెస్సీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత పటిష్టం చేశారు. కొద్ది సేపటి క్రితమే డీజీపీ శివధర్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. భద్రతా సిబ్బందికి డీజీపీ పలు సూచనలు చేశారు. కోల్‍కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో గందరగోళ పరిస్థితి జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇవాళ రాత్రి ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో స్టేడియంకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. టికెట్ ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని పోలీసులు సూచన చేశారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వద్ద 3 వేల మంది పోలీసులతో పాటు సీఆర్‍పీఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి కేంద్ర బలగాలను మోహరించారు.

Next Story