- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక దశకు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం.. మరి కాసేపట్లో గెజిట్ విడుదల!
జీహెచ్ఎంసీ విలీనం విషయంలో మరికాసేపట్లో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్‌లకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఇక విలీన ప్రక్రియ లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై ఇవాళ గెజిట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేలా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదించగా ఇందుకోసం ఒక జీహెచ్‌ఎంసీ చట్టం, రెండు తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ద్వారా చట్టం చేసే అవకాశం లేకపోవడంతో వీటికి సంబంధించి ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్ లను గవర్నర్ కు పంపించింది. వీటిలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) కు చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్సు, పురపాలక శాఖ నుంచి 7మున్సిపల్ కార్పొరేషన్స్ 20మున్సిపాలిటీలను తొలగించడానికి, 7మున్సిపల్ కార్పొరేషన్స్ 20మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో వీలినం చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్ లు ఉన్నాయి. ఈ మూడు ఆర్డినెన్స్ లను నిన్న గవర్నర్ ఆమోదించారు. దీంతో ఈ విలీన ప్రక్రియకు సంబంధించిన గెజిట్ ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది.






