ఆర్డినెన్స్ వచ్చేస్తోంది..! జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం

by Ramesh Naini |

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.

ఆర్డినెన్స్ వచ్చేస్తోంది..! జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఈ నెల 25న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్నిఈ నెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. దీంతో పాటు కేబినెట్ సమావేశం అనంతరం ఆర్డినెన్స్ తీసుకురావడానికి దీనికి సంబంధించిన ఫైల్ ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ కు సంబంధించిన ఫైల్ సోమవారం గవర్నర్ నుంచి ప్రభుత్వానికి వస్తుందని, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశముందని సెక్రటేరియట్ అధికారులు చెబుతున్నారు. ఒక సారి ఆర్డినెన్స్ వచ్చిదంటే విలీన ప్రక్రియ పూర్తయినట్టేనని అధికారులు చెబుతున్నారు.

Next Story