- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు తముళ్ల మనస్సుకు గాయం.. ఓ ఠాణ ఇన్స్ పెక్టర్ కించపర్చే మాటలు..
నీ ముఖం చూస్తే.. ఆ శని ముఖం చూసినట్లే ఉంటుంది.. అంతా దరిద్రం.. నీవు నాకు కనిపించకు.. నీవు వేస్ట్.. ఎందుకు పనికిరావు,

దిశ , సిటీక్రైం : నీ ముఖం చూస్తే.. ఆ శని ముఖం చూసినట్లే ఉంటుంది.. అంతా దరిద్రం.. నీవు నాకు కనిపించకు.. నీవు వేస్ట్.. ఎందుకు పనికిరావు, నీ తోని ఏం కాదు.. ఇలా అందరీ ముందు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ లో కొత్తగా ఏర్పాటైన హల్ చల్ జోన్ లోని ఓ కీలకమైన ఠాణాకు ఇన్స్ పెక్టర్ గా ఉన్న అధికారి మాట్లాడుతుండడంతో పోలీసు కానిస్టేబుల్ తమ్ముళ్లు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఇలాంటి కించపరిచే మాటలు పడ్డ కొందరు కానిస్టేబుళ్ళు మనస్సును గాయపర్చుకుని డిప్రెషన్ లోకి వెళ్ళారని పోలీసులు వర్గాలు అంటున్నాయి. ఓ కానిస్టేబుల్ మాత్రం ఏకంగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేసినట్లు తెలిసి మరో అధికారి అతనిని ఓదార్చి ధైర్యం చెప్పి సాధారణ స్థితి తీసుకు వచ్చాడని పోలీసులు వర్గాలు అంటున్నాయి.
ఇటు రాజీవ్ రహదారికి, అటు నిజామాబాద్ హై-వేకు మధ్యలో ఉన్న ఈ ఠాణా ఇన్స్ పెక్టర్ ప్రవర్తనను ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే వింతగా మాట్లాడుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రెండో తిరుపతిగా పేరొందిన బాలాజీ దేవాలయంతో పాటు చుట్టు చిన్న చిన్న దేవాలయాల పరిసరాలతో ఉండే ఈ ఠాణా కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఠాణా కు ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ఏ అధికారి కూడా ఇలా సిబ్బందిని మానసికంగా హింసించే విధంగా వ్యవహరించలేదని పోలీసు వర్గాలు చెప్పుతున్నాయి.
ఉన్నతాధికారులను సైతం డొంట్ కేర్
తనకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తనను ఎవరు టచ్ చేయలేరనే వాదనతో కింది స్థాయి సిబ్బందిని భయాందోళనకు గురి చేసేలా వారిని అసంత్రుప్తిలోకి నెట్టుతున్నాడని సిబ్బంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారని పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి, ఏ ఉన్నతాధికారైనా నన్ను ఏం అడగరంటూ గాంభీర్యం ప్రదర్శిస్తుండడంతో ఈ ఠాణా ఇన్స్ పెక్టర్ పై ఫిర్యాదు చేసినా హైయర్ ఆఫీసర్ లు పట్టించుకోరనే ఆందోళన కింది స్థాయి సిబ్బందిలో నెలకొంది.
పోలీసు కమిషనరేట్ లో ఠాణా ఇన్స్ పెక్టర్ లపై నిఘా పెట్టే విభాగం ఉన్నతాధికారి బంధువుకు ఈ ఇన్స్ పెక్టర్ క్లాస్ మేట్ కావడంతో ఇతని పై ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినా, అందినా వాటిని పోలీసు కమిషనర్ వద్దకు వెళ్ళకుండా అడ్డుకుంటారని తెలిసింది. దీంతో తీవ్రమైన కలవర పరిస్థితిలో ఈ ఠాణాలోని కింది స్థాయి సిబ్బంది పని చేస్తున్నట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువే
ఈ ఠాణా ఇన్స్ పెక్టర్ పై సొంత సిబ్బందే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి కూడా ఎక్కువేనని చెప్పుతుంటారు. దీని కోసం తనకు నచ్చిన అధికారులను పెట్టుకుని తతంగాన్ని నడిపిస్తుంటాడని ఆ ఠాణాలో పని చేసే వారే విమర్శిస్తున్నారు. అతని అవినీతితో మాకు సంబంధం లేదు... కాని మమ్మల్ని కించపర్చే విధంగా మాట్లాతుండడంతో తాము అవమానబారంగా ఫీల్ అవుతున్నట్లు కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేము కూడా పోలీసుగా ప్రజా సేవకు వచ్చాం
పోలీసు అవ్వాలని కలలు కని , కష్టపడి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం. ప్రజలకు తమ వంతుగా పోలీసుగా సేవలు అందించేందుకు ఉత్సాహంగా ఉన్నా తమను ఇలా దిగజార్చే విధంగా ఠాణ ఇన్స్ పెక్టర్ మాట్లాడడం తో తాము ఎందుకురా ఈ ఉద్యోగంలో వచ్చామని బాధపడుతున్నట్లు పోలీసు తమ్ముళ్లు మదన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా నే కొనసాగితే తామే తెగించి పోలీసు శాఖ క్రమశిక్షణను పక్కన పెట్టి నిరసనకు దిగుతామని కిందిస్థాయి అంటున్నారు.






