- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్ప మాల ధరించిన ఎస్ఐకి మెమో.. పోలీసులపై రెచ్చిపోయిన రాజాసింగ్
అయ్యప్ప మాల(Ayyappa Mala) ధరించిన కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్‌కు మెమో జారీ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప మాల(Ayyappa Mala) ధరించిన కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్‌కు మెమో జారీ అయింది. మాల వేయడం, గడ్డం పెంచడం, పోలీసు బూట్లు లేకుండా దీక్ష చేపట్టడంపై వివరణ ఇవ్వాలని సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పోలీసులకు కీలక సూచనలు చేశారు. మాల వేసుకునే వారు, వేసుకోవాలని నిర్ణయించుకున్న వారు పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. 2 నెలల పాటు సెలవులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే.. ఎస్‌ఐకి మెమో జారీ చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ అయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లిం పోలీసులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరు అని ఫైర్ అయ్యారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని ఆయన సూచించారు.






