- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాషన్ షోలో మేఘా కృష్ణారెడ్డి భార్య.. నెక్లెస్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలోకి ఎక్కిన మేఘాకృష్ణారెడ్డి భార్య మేఘా సుధారెడ్డి మంగళవారం న్యూయార్క్ లో జరిగిన 2026 మెట్ గాలాలో సందడి చేశారు. ప్రత్యేకమైన డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తూ తన లుక్ తో అక్కడున్నవాళ్లను కట్టిపడేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలోకి ఎక్కిన మేఘాకృష్ణారెడ్డి భార్య మేఘా సుధారెడ్డి మంగళవారం న్యూయార్క్ లో జరిగిన 2026 మెట్ గాలాలో సందడి చేశారు. ప్రత్యేకమైన డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తూ తన లుక్ తో అక్కడున్నవాళ్లను కట్టిపడేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి డ్రెస్ తో పాటు ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, చేతికి ధరించిన రింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సుధారెడ్డి ధరించిన డైమండ్ నెక్లెస్ విలువ దాదాపు రూ.142 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ నెక్లెస్ లోని డైమండ్ టాంజానియాలోని మెరెలాని పర్వతాల నుండి సేకరించిన 550 క్యారెట్ల క్వీన్ ఆఫ్ మెరెలాని అనే వాయిలెట్ నీలంరంగు టాంజనైట్ డైమండ్ అని పిలుస్తారు.
అంతే కాకుండా ఆమె ధరించిన ఉంగరాలు సైతం కోట్ల రూపాయలు ఉంటాయని ఇక డ్రెస్ 3వేల గంటలకు పైగా కష్టపడి హస్తకళాకారులు రూపొందించినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం శైలిలో సహజ రంగులు వాడి పూర్తిగా చేతితో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె డ్రెస్ పై తెలంగాణకు చెందిన పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడు పువ్వు లాంటి చిహ్నాలు కనిపించాయి. ఈసారి మెట్ గాలాను ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్ అనే డ్రెస్ కోడ్ తో నిర్వహించగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్ తో సుధారెడ్డి రెడ్ కార్పెట్ పై నడిచారు. ఇక సుధారెడ్డి మెట్ గాలాకు హాజరవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండు సార్లు ఆమె హాజరవ్వగా అప్పుడు సైతం తన డ్రెస్సింగ్, జ్యూవెలరీతో తలుక్కుమన్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.






