- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌ను సత్కరించి అభినందించిన చిరంజీవి
పద్మ శ్రీ అవార్డు దక్కిన సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: సినీ నటులు మురళీమోహన్(Murali Mohan), రాజేంద్రప్రసాద్(Rajendra Pradesh)కు పద్మ శ్రీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సైతం అభినందించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో మురళీ మోహన్ ఇంటికి సోమవారం సాయంత్రం చిరంజీవి వెళ్లారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మురళీమోహన్‌కు శాలువా కప్పి చిరంజీవి అభినందించారు. అటు రాజేంద్రప్రసాద్ ను సైతం చిరంజీవి సత్కరించి అభినందించారు.
ఇద్దరితోనూ..
కాగా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా సినిమాలో కలిసి నటించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవికి అన్నగా మురళీమోహన్ నటించారు. అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమాలో హైలెట్‌గా నిలించింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో చిరంజీవితో పాటు మోరళీమోహన్‌కు మంచి గుర్తింపు లభించింది. అటు రాజేంద్రప్రసాద్ తోనూ చిరంజీవి చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా హిట్లర్ సినిమాలో బావమర్దిదిగా రాజేంద్ర ప్రసాద్ నటనకు చిరంజీవి అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. చిరంజీవి సినీ కెరీర్‌లో గ్యాంగ్ లీడర్, హిట్లర్ సినిమాలు గుర్తిండిపోయేవిగా నిలిచాయి. ఇద్దరు సహనటులకు పద్మశ్రీ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరినీ ఇంటికెళ్లి మరీ అభినందనలు తెలిపారు.






