Megha Reddy: సెక్రటేరియట్‌లో పోలీసుల అత్యుత్సాహం.. ఎమ్మెల్యే మేఘా రెడ్డికి చేదు అనుభవం

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-22 17:09:31  IST  )

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (Megha Reddy)కి సెక్రటేరియట్‌ (Secretariat)లో ఇవాళ చేదు అనుభవం ఎదురైంది.

Megha Reddy: సెక్రటేరియట్‌లో పోలీసుల అత్యుత్సాహం.. ఎమ్మెల్యే మేఘా రెడ్డికి చేదు అనుభవం
X

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (Megha Reddy)కి సెక్రటేరియట్‌ (Secretariat)లో ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. ఆరో అంతస్తులో సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari) వస్తున్న సమయంలోనే వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (Megha Reddy) అదే ఫ్లోర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ పోలీసులు (SPF Police) ఎమ్మెల్యే మేఘా రెడ్డిని అడ్డుకున్నారు. సీఎస్ (CS) వస్తున్నారు.. పక్కన ఉండాలంటూ నిలబెట్టారు. దీంతో తాను ఎమ్మెల్యేనని చెప్పినా ఆయన మాటను వినిపించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే మేఘా రెడ్డి, సీఎస్ వస్తే.. ఫ్లోర్‌లో ఎవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఇలాంటి ఘటనలు సెక్రటేరియట్‌లో నిత్యం చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. కనీసం ఎవరు ఎంపీ.. ఎవరు ఎమ్మెల్యేనో ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Next Story