- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో మెగా ఫార్మా ఎక్స్‌పో.. హైదరాబాద్‌లో సన్నాహక రోడ్‌షో
'ఫార్మా మాక్‌టెక్ - ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో 2026' రెండో విడతకు సన్నాహకంగా దేశంలోని అగ్రగామి ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ అయిన ఈఈపీసీ భారత్ శుక్రవారం హైదరాబాద్‌లో రోడ్‌షోను నిర్వహించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: 'ఫార్మా మాక్‌టెక్ - ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో 2026' రెండో విడతకు సన్నాహకంగా దేశంలోని అగ్రగామి ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ అయిన ఈఈపీసీ భారత్ శుక్రవారం హైదరాబాద్‌లో రోడ్‌షోను నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో దేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో రెండో విడత ‘ఫార్మా మాక్‌టెక్ - ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో 2026’ జరగనుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫార్మా ప్రదర్శనలలో ఒకటిగా పేరుగాంచిన ఐపెక్స్‌తో కలిపి ఈ ఎక్స్‌పోను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలు ఫార్మా, వైద్యారోగ్య ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన పూర్తి విలువ గొలుసును ఒకే వేదికపైకి తీసుకురానున్నాయి.
ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ రీజినల్ జాయింట్ డీజీఎఫ్టీ అక్షయ్ ఎస్.సీ.. ఈ రంగాల వ్యూహాత్మక మద్దతును ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశ ఫార్మాస్యూటికల్ (ఔషధ) రంగం భవిష్యత్తు వృద్ధి, దేశీయ ఉక్కు, ఉత్పాదక రంగాల బలంపైనే గణనీయంగా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమ రంగాన్ని కోరారు. దేశ వ్యాక్సిన్ సరఫరాలో 1/3 వంతు, బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా హైదరాబాద్‌దేనని తెలిపారు. ఫార్మా యంత్రాల రంగం 8-10 శాతం వృద్ధితో దూసుకుపోతున్నా, హైటెక్ పరికరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నామని, ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ, యంత్రాలు, ల్యాబ్ పరికరాల విభాగంలో భారత్ ప్రస్తుతం వాణిజ్య లోటును ఎదుర్కొంటోందన్నారు. ఈఈపీసీ భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్- కార్యదర్శి అదిప్ మిత్ర స్వాగత ప్రసంగం చేశారు. అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దీనికోసం తయారీదారులు, ఎగుమతిదారులు విలువ ఆధారిత, ఆవిష్కరణలతో కూడిన నైపుణ్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఫార్మా 4.0, ఆటోమేషన్, ప్రిసిషన్ డ్రగ్ డెలివరీ, నాణ్యమైన ల్యాబ్ పరికరాల వంటి తాజా ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు 'ఫార్మా మాక్‌టెక్- ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో 2026' ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ రోడ్‌షోలో స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, నెక్స్ట్-జెన్ లాబొరేటరీ సొల్యూషన్స్‌పై నిపుణులు చర్చించారు. కార్యక్రమంలో సీడీఎస్‌సీఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె. నరేంద్రన్, ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు, ఈఈపీసీ రీజినల్ డైరెక్టర్ రాకేష్ సూరజ్, ఉప ప్రాంతీయ చైర్మన్ అరుణ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.






