KTR అధ్యక్షతన తలసాని ఇంట్లో కీలక సమావేశం.. మేయర్‌కు షాకివ్వబోతున్నారా?

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్‌(Greater Politics)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

KTR అధ్యక్షతన తలసాని ఇంట్లో కీలక సమావేశం.. మేయర్‌కు షాకివ్వబోతున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్‌(Greater Politics)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలతో తలసాని నిర్వహించిన ఈ లంచ్‌ మీటింగ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరయ్యారు. గ్రేటర్‌లో బీఆర్ఎస్(BRS) కార్యకలాపాలు, మేయర్‌పై అవిశ్వాసం, తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. మేయర్‌ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi)పై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు.

కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్‌పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కున్న పట్టుకోల్పోకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. నిత్యం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు చేయాలని.. అందరికీ టచ్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఎలా ముందుకు వెళ్లాలి.. తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా సమావేశంలో చర్చించారు. అదే విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు గ్రేటర్ వ్యాప్తంగా ఎండగట్టాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

Next Story