Congress: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ వార్నింగ్! అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీరుపై మీనాక్షి నటరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Congress: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ వార్నింగ్! అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి (Mallu Ravi) ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత రెండు రోజుల క్రితం తొలిసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మల్లు రవి నేరుగా గాంధీ భవన్‌కు వచ్చారు. అక్కడ మాజీ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడే ఉన్న మీనాక్షి చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. అలాగే గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మీనాక్షి నటరాజన్ మల్లురవి తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా? ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అలాగే ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబీయింగ్ చేశారని భవిష్యత్తులో ఆయన పార్టీ మారితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది.

Next Story