- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి మీనాక్షి నటరాజన్ దూకుడు.. కీలక మంత్రులతో వరుస భేటీలు
ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదర్‌గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల నేతలతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్‌లో పరిస్థితులపై దామోదర రాజనర్సింహతో చర్చించారు. వీరితో పాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రోజుకో నేత తమకు కేబినెట్‌లో చోటు కల్పించాలని గొంతు విప్పుతుండటంతో అప్రమత్తమయ్యారు.






