- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ మార్క్.. తనదైన శైలిలో ప్రాబ్లమ్స్ సాల్వ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి సారించారు. ఈ క్రమంలో పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించి, వారిని సెట్ చేసేందుకు మంత్రులు, కీలక లీడర్లకు ఆదేశాలిచ్చారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ మధ్య ఉన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రంగంలోకి దిగారు.
పార్టీ పరిస్థితులపై అభిప్రాయ సేకరణ
కొద్దిరోజులుగా గూడెం, కాటా మధ్య వివాదం నెలకొన్నది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నారని, ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్న లీడర్లను పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలు రొడ్డెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఎమ్మెల్యేకు షోకాజ్‌నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి, సమస్య పరిష్కరించాలని పార్టీ కమిటీని ఆదేశించింది. ఈ విషయంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్‌లను గాంధీ భవన్‌కు పిలిచి ఇరువురి అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం ఇదే విషయమై మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సమావేశమయ్యారు.
పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఘటనపై చర్చించారు. గూడెం, కాటా ఇష్యూపై చర్చించినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళితే బాగుంటుందని మంత్రి అభిప్రాయాన్ని శ్రీనివాస్ తీసుకున్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయాలు, ఇతర అంశాలన్నింటినీ అధిష్ఠానానికి త్వరలోనే నివేదిస్తామని ఆది శ్రీనివాస్తెలిపారు. దాదాపు నేతల మధ్య సమన్వయం కుదర్చి పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.






