Congress: టీ కాంగ్రెస్‌ నేతలతో మీనాక్షి నటరాజన్‌ భేటీ

by Prasad Jukanti |

తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి

Congress: టీ కాంగ్రెస్‌ నేతలతో మీనాక్షి నటరాజన్‌ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గకూర్పు అంశంపై అధిష్టానంతో రాష్ట్ర అగ్రనేతల సంప్రదింపులు ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) సమావేశం అయ్యారు. ఇవాళ హైదర్ గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోరజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి లోక్ సభ స్థానాల నేతలతో ఆమె భేటీ కాబోతున్నారు. తొలుత ఆదిలాబాద్ లోక్ సభ సెగ్మెంట్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇలా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతోనూ ఆమె విడివిడిగా భేటీ అయి ప్రభుత్వం, పార్టీకి సంబంధించి నేతల వద్ధ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ విషయంలో మాదిగ సమాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కావడం వారిలో కొంత మంది మీనాక్షి నటరాజన్ తో ఫోన్ లో మాట్లాడటం సెన్సేషన్ గా మారింది. ఈ క్రమంలో మాదిగ ఎమ్మెల్యేలు తనను కలవాలని ఆమె ఇవాళ సమయం ఇచ్చింది. దీంతో వారంతా ఇవాళ మీనాక్షిని కలవబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనేది పార్టీలో ఆసక్తిని రేపుతున్నది.

Next Story