- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
400 ఎకరాల వివాదంపై స్పందించిన మీనాక్షి.. HCU విద్యార్థులకు కీలక హామీ
కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమి వివాదంపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమి వివాదంపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) స్పందించారు. శనివారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం ఛాంబర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేసినట్లు స్పష్టం చేశారు. కమిటీ సభ్యులతో ఇప్పటికే అన్ని విషయాలను చర్చించినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ నష్టం కలుగకుండా వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని.. ప్రతిపక్షాల ఆరోపణలు పరిగణలోకి తీసుకొని.. వాస్తవాలేంటో ప్రజలకు క్లియర్‌గా చెబుతామని అన్నారు. ఆ తర్వాత గాంధీభవన్(Gandhi Bhavan) వేదికగా ఎన్‌ఎస్‌యూఐ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, cwc సభ్యులు వంశీచంద్ రెడ్డి, nsui అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.






