Meenakshi Natarajan: మీనాక్షి ఇన్ యాక్షన్.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపై గాంధీ భవన్ లో రివ్యూ

by Prasad Jukanti |

కాంగ్రెస్ నూతన ఇన్ చార్జి రంగంలోకి దిగారు.

Meenakshi Natarajan: మీనాక్షి ఇన్ యాక్షన్.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపై గాంధీ భవన్ లో రివ్యూ
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తన పని మొదలుపెట్టేశారు. ఇప్పటికే తన విధానం ఏంటో పీసీసీ కార్యవర్గ సమావేశంలో కుండబద్దలు కొట్టిన ఆమె ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీ భవన్‌లో (Gandhi Bhavan) టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ (Medak Lok Sabha Segment) సమీక్ష జరగనుంది. సమీక్షలో (Review) ప్రభుత్వ పనితీరు, పార్టీ నిర్ణయాలపై నేతల నుంచి మీనాక్షి నటరాజన్ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అలాగే త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు పార్టీ సిద్ధం అవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారనే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Next Story