ముందు ప్రేమ్ సాగర్ రావు.. ఆ తర్వాత వివేక్‌తో మీనాక్షి భేటీ.. ఏం మాట్లాడారో తెలుసా?

by Gantepaka Srikanth |

కాంగ్రెస్​పార్టీ వ్యవహారాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే బుధవారం ఆమె పార్టీ నేతలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ముందు ప్రేమ్ సాగర్ రావు.. ఆ తర్వాత వివేక్‌తో మీనాక్షి భేటీ.. ఏం మాట్లాడారో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ వ్యవహారాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే బుధవారం ఆమె పార్టీ నేతలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదర్​గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. పలు జిల్లాల లోకసభ స్థానాల నేతలతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, జహీరాబాద్, మాల్కాజిగిరి లోకసభ స్థానాల నేతలతో సమీక్ష జరిపారు. ఈ క్రమంలో మీనాక్షి నేతలతో వన్​టు వన్​మాట్లాడినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆమె ఆరా తీశారు. అలాగే, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, సంస్థల ఎన్నికలలో తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి నేతలతో చర్చించారు. నియోకవర్గాలలో స్థానికంగా నేతలు, నాయకుల మధ్య సమన్వయంపై తెలుసుకున్నారు.

పార్టీ బలోపేతం, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పనితీరు, పార్టీ పరంగా చేయాల్సిన వాటితోపాటు ఇటీవలి కాలంలో ఏర్పాటు చేసిన కమిటీల విషయమై నేతలతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మీనాక్షిని కలిసిన నేతలు తమ తమ సమస్యలు, సూచనలు కూడా ఆమె విన్నారు. నియోజకవర్గాల పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​జగ్గారెడ్డితో కూడా ఆమె భేటీ అయ్యారు. జగ్గారెడ్డితో ఆమె పలు అంశాలపై చర్చించారు. పార్టీలోని పరిస్థితులు, పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతల వ్యవహారం ఇలా అనేక అంశాలపై చర్చించారు. మొదట ప్రేమ్ సాగర్ రావుతో.. ఆ తర్వాత వివేక్‌తో మీనాక్షి భేటి అయ్యారు. కేబినెట్‌లో బెర్తులపై ఇద్దరు విన్నవించారు. తాను చెప్పాల్సింది చెప్పానని ప్రేమసాగర్​పేర్కొన్నారు. తాను ఎవరి వద్ద లొంగి మాట్లాడను.. సీఎం దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్ళిపోతానని చెప్పారు. తనకు మీడియాలో కనపడాలి అనే తాపత్రయం అస్సలు లేదన్నారు.

అయితే, ఇటీవల కాళేశ్వరంలో జరిగిన ప్రోటోకాల్ వివాదంపై ఇంచార్జి వద్ద వివేక్, ఎంపీ వంశీలు ప్రస్తావించారు. ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా భేటీ అయ్యారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌లో పరిస్థితులపై దామోదర రాజనర్సింహతో ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఆరా తీశారు. దాంతో పాటుగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సుమిత్రరావు చేసిన ఆరోపణలపై కూడా పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. పార్టీ నేతలతో భేటీ పూర్తయిన అనంతరం ఆమె.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశమై చర్చించనున్నారు. ఈ సమీక్షల ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి, తదుపరి చర్యలకు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story