- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ పీసీసీ సాధించిన విజయం: మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో టీపీసీసీ

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జనహిత పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనగా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ పీసీసీ సాధించిన విజయం అని అన్నారు. మన హక్కుల కోసం కదం తొక్కాలి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతోందని మీనాక్షి స్పష్టం చేశారు. బీసీలందరికీ న్యాయం జరగాలని అన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొట్లాడుతున్నారని వారికి ప్రజల మద్దతు ఉండాలన్నారు.






