- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలకం: మీనాక్షి నటరాజన్
by Ajay Maddhiboyina |
స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్లో రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ సమావేశం చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సంఘటన్ జాతీయ అధ్యక్షలు సునీల్ పన్వర్ విచ్చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సంఘటన్ కీలక బాధ్యతలు తీసుకుని పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సంఘటన్ పునర్ వ్యవస్తీకరణ చేస్తామని సునీల్ పన్వర్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Next Story






