Meenakshi Natarajan : కాంగ్రెస్ నేతలకు మీనాక్షీ క్లాస్

by Muthe.Rajitha |

తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జీ(Telangana AICC In-Charge)గా నియమించబడిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Nararajan) తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.

Meenakshi Natarajan : కాంగ్రెస్ నేతలకు మీనాక్షీ క్లాస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జీ(Telangana AICC In-Charge)గా నియమించబడిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Nararajan) తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రైల్లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి మీనాక్షీ నటరాజన్ హాజరవ్వగా.. అక్కడ కనిపించిన హంగు ఆర్భాటాలు చూసి కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకారు. అదే విధంగా గాంధీ భవన్లో నేతల హడావిడిపై చూసి ఆమె చిరాకు పడ్డారు. బొకేలు వద్దని ముందే వారించినప్పటికీ పలువురు నేతలు బొకేలు తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జీగా నియమించబడిన మీనాక్షి.. ఢిల్లీ నుంచి చాలా సింపుల్ గా రైల్లో వచ్చారు. కాగా కాసేపటి క్రితమే పీసీసీ విస్తృతస్థాయి సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తున్నారు.

Next Story