- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబ్బ రూప కుటుంబానికి అండగా ఉంటాం.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ భరోసా
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు భరోసా ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) గాంధీ భవన్‌లో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో దుబ్బ రూప కూతురు సాత్విక కాంగ్రెస్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెతో మాట్లాడి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గుండెపోటుతో మరణించారు. ఆమె నవంబర్ 7 వ తేదీన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ప్రచారంలో ఆమె యాక్టీవ్‌గా ఉండటాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు.






