- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mee Seva: మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు: ఏ సర్టిఫికెట్‌కు ఎంతంటే?
తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో సర్వీసుల ధరలను అమాంతం పెంచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income) గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. రూ.80కి చేరింది. కుల ధ్రువీకరణ పత్రం (Caste) రూ.45 నుంచి 55 ఉంగా.. రూ.80కి, స్థానికత ధ్రువీకరణ పత్రం (Residence) రూ.45 నుంచి రూ.55 ఉంగా..రూ.80కి, అదేవిధంగా జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ (Birth) గతంలో రూ.40 నుంచి 45 ఉండగా..రూ.62కు పెంచారు.
విద్యార్థులు, అభ్యర్థులపై అదనపు భారం
సాధారణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటి ధరలను ఏకంగా 80 రూపాయలకు పెంచడం వల్ల మధ్యతరగతి, పేద వర్గాలపై ఆర్థిక భారం పడనుంది. మరోవైపు చాలా కాలంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు తమకు వచ్చే కమీషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెరిగిన కరెంట్ బిల్లులు, ఇంటర్నెట్, సిబ్బంది ఖర్చుల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమని వారు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఒకేసారి 50 శాతం మేర సర్వీసు ఛార్జీలు పెంచడంపై సామాన్య ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.






