కాళేశ్వరం కుంభకోణంలో మీ వాటా ఎంతో చెప్పండి: మేడిపల్లి సత్యం

by Ajay Maddhiboyina |

ద‌ళిత బంధు ప‌థ‌కంపై కేటీఆర్ ముస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం అన్నారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్, కేటీఆర్ కు ద‌ళితులు గుర్తుకురాలేద‌ని విమ‌ర్శించారు.

కాళేశ్వరం కుంభకోణంలో మీ వాటా ఎంతో చెప్పండి: మేడిపల్లి సత్యం
X

దిశ‌, వెబ్ డెస్క్: ద‌ళిత బంధు ప‌థ‌కంపై కేటీఆర్ ముస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం అన్నారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్, కేటీఆర్ కు ద‌ళితులు గుర్తుకురాలేద‌ని విమ‌ర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పీఠం క‌దులుతుంద‌ని ద‌ళిత బంధు తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని మోసం చేయ‌లేదా అంటూ ప్ర‌శ్నించారు. మూడెక‌రాల భూమి ఇస్తామ‌ని ఒక్క సెంటైనా ఇచ్చారా..? అంటూ ప్ర‌శ్నించారు.

డిప్యూటీ సీఎంతో పాటు మూడు మంత్రి ప‌ద‌వులు ద‌ళితుల‌కు ఇచ్చి రేవంత్ రెడ్డి చ‌రిత్ర సృష్టించార‌న్నారు. ద‌ళితుల‌ను మోసం, ద‌గా చేసిన మీరు ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని లూటీ చేశార‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో దోపిడీపై హ‌రీష్ రావు పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ పెట్టాల‌న్నారు. నెల రోజుల్లో కాలేశ్వ‌రంలో ప‌నిచేసిన ముగ్గురు ఇంజ‌నీర్లు క‌ళ్లు బైర్లు క‌మ్మే ఆస్తుల‌తో ఏసీబీకి చిక్కార‌ని మండిప‌డ్డారు. మామూలు ఇంజ‌నీర్లే కోట్ల‌తో దొరికితే కాళేశ్వ‌రం సృష్టిక‌ర్త‌లు అయిన మీరు ఎన్నికోట్ల అవినీతి చేసి ఉంటారో అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story