ప్రీతిది ఆత్మహత్యే అని నమ్ముతున్నా: తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ప్రీతిది ఆత్మహత్యే అని నమ్ముతున్నా: తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ సీపీ రంగనాథ్‌తో మాట్లాడి తన కూతురు ప్రీతి మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నామని మెడికో ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. ప్రీతి తండ్రి, ఆమె సోదరుడు శనివారం సీపీ సీవీ రంగనాథ్‌ను కలిసి ఆయనతో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురు ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సిరంజి దొరికిందని సీపీ చెప్పారని మీడియాకు వెల్లడించారు.

శరీరంలో విషపదార్థాలున్నట్లు రిపోర్టు వచ్చిందని చెప్పారని అన్నారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ తమకు చూపించలేదని తెలిపారు. ఛార్జ్ షీట్‌లో మరికొన్ని పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు తమ కూతురిది హత్యేనని ఆరోపించిన ప్రీతి తండ్రి.. సీపీతో సమావేశం అనంతరం మాత్రం తమ కూతురుది ఆత్మహత్యేనని నమ్ముతున్నానని చెప్పడం గమనార్హం. ఇక, వేధింపులతో ప్రీతి మరణానికి కారణమైన ఆమె సీనియర్ సైఫ్ ఇటీవల బెయిల్‌పై ఖమ్మం జైలు నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Next Story