- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి దృష్టికి మెడికల్ విద్యార్థుల సమస్యలు.. సానుకూల స్పందన
మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తరపున పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలోనూ ఇతరత్రా చేస్తున్న సహాయాన్ని తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.

దిశ, వెబ్‌డెస్క్: మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తరపున పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలోనూ ఇతరత్రా చేస్తున్న సహాయాన్ని తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) అభినందించారు. అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహాను బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ ఏర్పాటుచేసిన 2026 క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ్యులు రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మెడికల్ కాలేజీల్లో సమస్యల పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, సభ్యులు పొడిశెట్టి రమేష్, కట్ట వెంకటరావు, శ్రీనివాస్, రత్న ప్రసాద్, బొడ్డుపల్లి సుజాత, సంధ్య, దుర్గాప్రసాద్, రవీందర్, భాస్కరరావు, పత్రి యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






