- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడికల్ కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించాలి
ప్రభుత్వం 2024 జూలై నెలలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 33 ద్వారా 2024 వరకు చదువు పూర్తి చేసి, మంచి ర్యాంకులు సాధించిన పిల్లలు (విద్యార్థుల) స్థానికత పేరుతో తీవ్రంగా నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని, నాన్ లోకల్ కింద పరిగనింపబడి నష్టపోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మెడికల్ కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించాలి
- లోకల్, నాన్ లోకల్ సమస్యపై సడలింపు ఇవ్వాలి
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల నిరసన
దిశ, రాంనగర్ : ప్రభుత్వం 2024 జూలై నెలలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 33 ద్వారా 2024 వరకు చదువు పూర్తి చేసి, మంచి ర్యాంకులు సాధించిన పిల్లలు (విద్యార్థుల) స్థానికత పేరుతో తీవ్రంగా నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని, నాన్ లోకల్ కింద పరిగనింపబడి నష్టపోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కౌన్సిలింగ్ 2025 లో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. హైదరాబాద్, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు జాకీర్ అహ్మద్, నవీన్ కుమార్, లక్ష్మీ, విగ్నేశ్వర రావు, అశోక్ లు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 33 ను పూర్తిగా సమర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖలలో ఏదైనా జీవో జారీ అయినప్పటి నుండే నిబంధనలు అమలవుతాయని, కానీ కొంతమంది ఉన్నతాధికారుల బాధ్యత రాహిత్యం వల్ల వెసులుబాటు ఉన్నా సరే బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులను వైద్య విద్యకు నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 33 ను 2024 లో ప్రభుత్వం జారీ చేసిందని, జీవో జారీ చేయబడిన తేదీ కంటే ముందే పక్క రాష్ట్రాల్లో చదువు పూర్తి చేశారని, పిల్లలు కేవలం రెండు సంవత్సరాలు పక్క రాష్ట్రంలో విద్యను అభ్యసించినంత మాత్రాన నాన్ లోకల్ గా పరిగణించడం భావ్యం కాదని, అలా పరిగణించడం వల్ల 2025 నీట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన 50 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని లోకల్ క్రింద పరిగణించాలని, మెడికల్ కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలందరూ స్థానికులు కానప్పుడు ఎలక్షన్లలో తమవి ,పిల్లల ఓట్లు ఎలా పరిగణిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వారి స్థానికత ఎక్కడో, వారి భవిష్యత్తు ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల విద్యార్థులు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్న మంచి కాలేజీలో పిల్లలని చేర్పించాలని కోరుకుంటారని, మేము అలాగే చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 సంవత్సరాల ఏ రాష్ట్రంలో చదివినా వారి స్థానికత కోటకు అర్హులేనని ప్రభుత్వాలు ప్రకటించాయన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నీట్ కౌన్సిలింగ్ విషయంలో లోకల్, నాన్లోకల్ సమస్యపై సడలింపు ఇచ్చి నష్టపోతున్న విద్యార్థులను ఆదుకోని కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






