- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఎంబీబీఎస్ టాపర్లకు గోల్డ్ మెడల్స్
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల (మొత్తం 33) ఎంబీబీఎస్ పరీక్షల టాపర్లకు ప్రశంసా పత్రాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల (మొత్తం 33) ఎంబీబీఎస్ పరీక్షల టాపర్లకు ప్రశంసా పత్రాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ ఆలుమ్ని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను కౌన్సిల్ చైర్మన్ డా. మహేష్ కుమార్ అభినందించారు. వారి విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించారు. వైద్య వృత్తిలో నైతిక విలువలు అత్యంత ముఖ్యమని, సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని, ఆర్థిక ప్రయోజనాల కోసం నకిలీ వైద్యులను ప్రోత్సహించకూడదని సూచించారు. ఎంబీబీఎస్ సీటు సాధించడం నుండి గోల్డ్ మెడల్ వరకు విద్యార్థులు చేసిన కృషిని వైస్ చైర్మన్ డా. టి. కిరణ్ కుమార్ అభినందించారు. అదే పట్టుదలతో ముందుకు సాగుతూ, పరిశోధన రంగంలో కూడా ప్రతిభ చూపించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు ఇదే స్పూర్తితో కొనసాగాలని, వైద్య నైతికతను కచ్చితంగా పాటించాలని, నకిలీ డాక్టర్ల ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా. శ్రీనివాస్ గుండగాని సూచించారు. రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్, కౌన్సిల్ సభ్యులు డా. వి. నరేష్ కుమార్, డా. కృష్ణా రెడ్డి, డా. ఎం. శేషు మాధవ్, డా. ఆనంద్, డా. సన్నీ డేవిస్, డా. ఇమ్రాన్ అలీ, డా. కె. విష్ణు మరియు కో-ఆప్టెడ్ సభ్యులు డా. అజ్జా శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.






