- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలనే లక్ష్యంగా చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా ముఠా
మానవ అక్రమ రవాణా ముఠాలు పేదరికంలో జీవిస్తున్న ఎంపిక చేసుకొని, బలమైన కుటుంబ నిర్మాణం లేని పిల్లలు, మహిళలు, ఒంటరి వ్యక్తులను, తక్కువ విద్య ఉండి, దిగువ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్య్రంగా చేసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మానవ అక్రమ రవాణా ముఠాలు పేదరికంలో జీవిస్తున్న ఎంపిక చేసుకొని, బలమైన కుటుంబ నిర్మాణం లేని పిల్లలు, మహిళలు, ఒంటరి వ్యక్తులను, తక్కువ విద్య ఉండి, దిగువ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్య్రంగా చేసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బాండెడ్ లేబర్ అంశాలపై తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి వారి చేత వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమాజంలో అత్యంత దుర్బల వర్గాల వారిపై ప్రభావం చూపుతుందన్నారు.
బాధితుల్లో సగానికి పైగా బలవంతపు లేదా బాండెడ్ లేబర్‌లో ఉన్నారని, వారంతా ఇటుక బట్టీలు, గృహ నిర్మాణం, ప్రాజెక్టు పనులు, బహుళ అంతస్తుల్లో పనులు, వస్త్ర కర్మాగారాలు, వ్యవసాయం, రాతి గనులలో రోజుకు 12 గంటలు, అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. దళారులు వారికి కూలి పని కల్పిస్తామని ముందుగానే అత్యధిక డబ్బులు ఆశ చూపి వడ్డీల ద్వారా అప్పులు సమకూర్చి వారి జీవితాలను, వారి కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్నారని ఆయన అన్నారు. వీరిని ఆయా యజమానులు మనుషుల లాగా కాకుండా కేవలం వస్తువులుగా చూస్తూ, ఇసడించుకుని తక్కువ స్థాయి వ్యక్తులుగా ముద్రవేసి వారి జీవితాలను చెరిపేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దశాబ్ద కాలంగా కొన్ని కుటుంబాలు తరతరాలుగా బంధించబడిన శ్రమను అనుభవిస్తాయని వారికి విముక్తి కలిగేలా చూడాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. మరణించిన కార్మికుల అప్పులు వారి పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులకు బదిలీ చేసి ఇంకా వేదిస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. గృహ పని, నిర్మాణం వంటి తక్కువ నైపుణ్యం కలిగిన రంగాలలో పని కోరుకునే భారతీయ వలసదారులు వివిధ దేశాలకు వలసల పేరుతో కార్మికులు అక్రమ రవాణాలో చిక్కుకుంటున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోల బృందం మానవ అక్రమ రవాణా నేరాలకు సంబంధించిన దర్యాప్తు ఆధారాలను సేకరించడం, ప్రాణాలతో బయటపడిన వారిని విడిపించడం, అక్రమ రవాణాదారులను అరెస్టు చేయడంలో పోలీసులకు సహాకారం అందించి బాధితులకు తగు న్యాయం చేసేలా కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మీడియా కమ్యూనికేషన్స్ అధిపతి ప్రియా అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు.






