- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ ‘రఘు రాయ్’: మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ ‘రఘు రాయ్’ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం (టి.ఎస్.పి.జె.ఏ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పద్మశ్రీ రఘు రాయ్ సంస్మరణ సభను నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ ‘రఘు రాయ్’ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం (టి.ఎస్.పి.జె.ఏ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పద్మశ్రీ రఘు రాయ్ సంస్మరణ సభను నిర్వహించారు. టి.ఎస్.పి.జె.ఏ అధ్యక్షులు అనుమల్ల గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఐజెయు సెక్రటరీ జనరల్ సోమ సుందర్, ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.సత్యనారాయణ, టియుడబ్లుజె అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కె.రాములు, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డి.రవీందర్ రెడ్డి, టి.ఎస్.పి.జె.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నరహరి తదితరులు పాల్గొని ముందుగా పద్మశ్రీ రఘు రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన ఫోటోలతో భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ అని కొనియాడారు. ఫోటోలు భవిష్యత్తు తరాలకు మంచి ఆలోచనలు కల్పిస్తాయని అన్నారు.
కల్చర్, లైఫ్, బంగ్లాదేశ్ యుద్ధం, భోపాల్ గ్యాస్, దలైలామా, మదర్ థెరెసా, ఇందిరాగాంధీ తదితర గొప్ప వ్యక్తుల ఫోటోలు రఘు రాయ్ కు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయని చెప్పారు. ఫోటో జర్నలిస్టులు ఫోటోలను చిత్రించే క్రమంలో చేసే సాహాసాలు వారికి వృత్తిలో సంతృప్తినిస్తాయని చెప్పారు. సోమ సుందర్ మాట్లాడుతూ రఘు రాయ్ తీసిన ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా అనేక పత్రికలు సందర్భనుసారం ప్రచురితం చేశాయని గుర్తుచేశారు. ఆయన ఫోటోల్లో సహజత్వం ఉట్టి పడుతుందని, సందర్భాన్ని కళ్లకు కట్టినట్లు ఫోటో రూపంలో చూపించడం రఘు రాయ్ స్వంతం అని కొనియాడారు. కె.విరాహత్ అలీ మాట్లాడుతూ భారతదేశ ఫోటో జర్నలిస్టులకు కొత్త దిశ చూపిన ఏకైక ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ అని అన్నారు. కె. రాంనారాయణ మాట్లాడుతూ దేశంలోని ఫోటో జర్నలిస్టులందరికీ రఘు రాయ్ ఒక మార్గదర్శి అని, ఆయన ఫోటోలు తీసే క్రమంలో చూపించిన తెగువ, సందర్భం ఆయనను ఉన్నత స్థాయిలో నిలిపాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కిషోర్ సింగ్, పి. రామ్మూర్తి, సంయుక్త కార్యదర్శి బి.హెచ్.ఏం.కె. గాంధీ, కోశాధికారి కె. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు పి. మోహన చారి, ఎండి. ఏలీముద్దీన్, జి. వసంత్ కుమార్, నక్క శ్రీనివాస్, ఏ. మహేష్ కుమార్, పి. హరి కృష్ణ, ఎన్. శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






