Medha School: స్కూళ్లోనే డ్రగ్స్ తయారీ.. మేధా స్కూల్ సీజ్

by Prasad Jukanti |   (  Updated:2025-09-14 10:29:40  IST  )

బోయినపల్లి మేధా స్కూల్ అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

Medha School: స్కూళ్లోనే డ్రగ్స్ తయారీ.. మేధా స్కూల్ సీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మేధా ప్రైవేట్ పాఠసాలలో డ్రగ్స్ తయారీపై సర్కార్ సీరియస్ అయింది. మేధా స్కూల్ ను సీజ్ (Medha school siege) చేసింది. ఈ మేరకు మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. బాలానగర్ ఎంఈవో హరీశ్ చంద్ర ఆదేశాలతో ఈ స్కూల్ ను సీజ్ చేశారు. ఈ స్కూల్ లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిని ఇతర స్కూల్ లో చేర్పించేందుకు విద్యాసాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాఠశాల భవనంలో ఉదయం పూట పాఠశాల కొనసాగుతుండగా మరో రెండు గదుల్లో అల్పాజోలం తయారీ నిర్వహిస్తున్నట్లు ఈగల్ బృందం దాడుల్లో బయటపడింది. రెండేళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాశ్ గౌడ్ నిర్వహిస్తుండగా ఈ స్కూల్ ను అడ్డం పెట్టుకుని మత్తు పదార్థాల తయారీ చేపట్టినట్లు తాజా దాడుల్లో బట్టబయలైంది.

పేరెంట్స్ లో ఆందోళన:

స్కూల్ అనుమతులు రద్దు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడి విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా కొత్త పాఠశాలలు అన్ని విధాలుగా తమకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కొత్త స్కూళ్లు ప్రస్తుతం ఉన్న స్కూల్ తో పోలిస్తే దగ్గరే ఉంటుందా లేదా దూరం వెళ్లాల్సి వస్తుందా? అక్కడి ఫీజులు ప్రస్తుత స్కూల్ ఫీజులపై రకరకాల ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యలకు అధికారులు ఎలా పరిష్కారం చూపిస్తారో చూడాలి మరి.

Next Story