- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్యలు శూన్యం... నోటీసులకే పరిమితం
ఘట్కేసర్ మున్సిపాలిటీ, మండల రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ, మండల రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. నాలాల అక్రమాలపై చర్యలు తీసుకునే విషయంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించి చివరికి ఎమ్మార్వో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. నాలాల ఆక్రమణ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులే ఏం చేయలేకపోయారు, పోలీస్ కేసులు ఏం చేస్తాయని రియల్టర్లు బాహాటంగా కాలర్ ఎగరేస్తున్నారు.
నాలాల అక్రమణలపై మేమేం చేస్తాం...!?
జూలై 7వ తేదీన "దిశ" పత్రికలో "నాడు అక్రమం... నేడు సక్రమమా..?" అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి ఇరిగేషన్ శాఖ స్పందించి ఘట్కేసర్ ఎమ్మార్వో, ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ కు మండల రెవెన్యూ పరిధి మర్పల్లిగూడాలో సర్వేనెంబర్ 23, 24, 30 లలో వెంచర్ నిర్వాహకులు నాళాలు ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాలపై చర్యల విషయంపై జులై 16వ తేదీన లేఖలు రాశారు. ఇరిగేషన్ శాఖ తమకు పంపిన లేఖ విషయంలో ఎమ్మార్వో ఇరిగేషన్ శాఖ ఏఈ పై మండిపడినట్లు తెలిసింది. నాళాల ఆక్రమణకు రెవెన్యూ శాఖకు మాకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇదేవిధంగా ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సైతం నాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి నాకెలా తెలుస్తుంది, సర్వే చేసి మార్కింగ్ పెడితే వచ్చి ఏదైనా చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. చేసేదిలేక చివరకు ఘట్కేసర్ ఎమ్మార్వో డీఎస్ రజిని మంగళవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో వెంచర్ నిర్వాహకుడు కొల్లు బాలరాజు తో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయాన్ని పత్రికలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
నాళాల ఆక్రమణ పై చర్యలు తీసుకుంటారా...?
ఏది ఏమైనా ఘట్కేసర్ మండలం రెవెన్యూ పరిధి మర్పల్లిగూడాలో సర్వేనెంబర్ 23, 24, 30 లలో అభివృద్ధి చేస్తున్న వెంచర్ లో నాళాల ఆక్రమణపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారా నోటీసులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకే పరిమితం అవుతారాని చర్చ జరుగుతోంది. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు స్పందించకపోతే స్థానికులు జిల్లా కలెక్టర్ తో పాటు, హైడ్రా కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.






