- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచారం పీఎస్ పరిధిలో యువతి అదృశ్యం..
by Kodari Anjali |
పోచారం పీఎస్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఉంటున్న యువతి అదృశ్యమైంది.

X
దిశ, ఘట్కేసర్: పోచారం పీఎస్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఉంటున్న యువతి అదృశ్యమైంది. పోలీసుల కథన ప్రకారం... కీసర మండలం, రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న చిట్యాల లక్ష్మి, కుమార్తె చిట్యాల రేవతి(20), సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఉదయం పనికి వెళ్లి సాయంత్రం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలలో ఆమె కోసం వెతికారు బంధువులు, స్నేహితులు, ఇతర తెలిసిన వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించగా, అది స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో యువతి తల్లి పోచారం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






