- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం
రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో మహిళ దుర్మణంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

దిశ, మేడ్చల్ టౌన్: రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో మహిళ దుర్మణంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ నెంబరు జాతీయ రహదార్ ప్రభుత్వ ఐటీఐ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పూజారి పాలెం గ్రామానికి చెందిన అంబటి శ్రీను(38), భార్య అంబటి కళావతి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో నివాసం ఉంటున్నారు.
వారిద్దరూ మేడ్చల్ నుంచి అత్వల్లి వైపు సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో మేడ్చల్ నివాసం ఉండే రాజిరెడ్డి మరో వాహనంపై వస్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలను వెనుకగా వచ్చిన గుర్తు తెలియని కంటైనర్ ప్రభుత్వ ఐటీఐకి సమీపంలో ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు కింద పడిపోగా, కంటైనర్ చక్రాలు కళావతి తలపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. శ్రీనుతో పాటు రాజిరెడ్డికి గాయాలు అయ్యాయి. వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.






