- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాల సంగతేంటి ?
దుండిగల్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు ఘడించిన కాసా గ్రాండ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సియెరా’ విల్లా ప్రాజెక్టు తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : దుండిగల్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు ఘడించిన కాసా గ్రాండ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సియెరా’ విల్లా ప్రాజెక్టు తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కోతినారు చెరువు బఫర్ జోన్‌ను కబ్జా చేసి, బుంగలు కొట్టి మరీ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారన్న రెవె న్యూ అధికారుల ఫిర్యాదుతో ఇప్ప టికే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేవలం కోతినారు చెవురొక్కటే కాదు, ఈ లేఔట్ వెనుక భాగంలో ఉన్న దుండిగల్ పెద్ద చెరువు బఫర్ జోన్‌ను సైతం మింగేస్తూ నిర్మాణాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ తోడు ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ‘రెరా’ అనుమతులు లేకపోవడం, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించేలా లీగల్ టీం పొంతన లేని సమాధానాలు చెప్పడం ఈ ప్రాజెక్టుపై పలు అనుమానాలకు తావిస్తున్నది.
రెండు చెరువుల నడుమ లగ్జరీ వెంచర్..
ఎకరం కోట్లాది రూపాయలు పలికే దుండిగల్ పరిసర ప్రాంతాల్లో కాసా గ్రాండ్ సియెరా వెంచర్ పేరిట 10 ఎకరాల విస్తీర్ణంలో 117 లగ్జరీ విల్లాల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, ఈ లాభార్జనలో పర్యావరణ పరిరక్షణను, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు అని విమర్శిస్తున్నారు. కోతినారు చెరువు కట్టను ధ్వంసం చేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నట్లు తహశీల్దార్ ఎన్. రాజేశ్వర్ రెడ్డి స్వయంగా గుర్తించారు. దీనిపై విచారణ జరిపి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థపై బీఎన్ఎస్ సెక్షన్లు 329(3), 324(4), ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPPA) కింద కేసు (FIR No. 628/2026) నమోదైంది. ఇంత జరుగుతున్నా, ప్రాజెక్టు వెనుక వైపున ఉన్న దుండిగని పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోకి కూడా లేఔట్ ఎమినిటీస్, మూడు నాలుగు విల్లాలు చొరబడేలా ప్లాన్ చేయడం గమనార్హం.
56 పేజీల బ్రోషర్‌లో ‘రెరా’ శూన్యం..
రియల్ ఎస్టేట్ చట్టాల ప్రకారం ఏదైనా ఒక మెగా ప్రాజెక్టును ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నా, ప్రకటనలు ఇవ్వాలన్నా ‘రెరా’ అప్రూవల్ నెంబ ర్ తప్పనిసరిగా ప్రదర్శించాలి. కానీ, కాసా గ్రాండ్ అందుబాటులో వచ్చిన 56కి పైగా పేజీల అత్యంత విలాసవంతమైన కలర్ బ్రోషర్‌లో ఎక్కడా రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఊసే లేదు. వినియోగదారులను ఆకర్షించేందుకు రోమన్ ఆర్కిటెక్చర్, 65 శాతం ఓపెన్ స్పేస్ అంటూ రంగుల ప్రపంచాన్ని చూ పించిన యాజమాన్యం, చట్టబద్ధమైన రెరా సంఖ్యను ఎందుకు దాచిపెట్టిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అనుమతి లేని ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే రేపు కొనుగోలుదారుల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
విభాగాల మధ్య పొంతన లేని సమాధానాలు..
ఈ వ్యవహారంపై సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులను సంప్రదించగా వారి అంతర్గత వైరుధ్యాలు బయటపడ్డాయి. సేల్స్ సిబ్బందిని ‘రెరా నెంబర్ ఏది?’ అని ప్రశ్నిస్తే.. "ఇప్పటికే దరఖాస్తు చేశాం, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది, త్వరలోనే వస్తుంది" అని దాటవేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కంపెనీకి చెందిన లీగల్ (న్యాయ) విభాగాన్ని వివరణ కోరగా.. "ఈ ప్రాజెక్టుకు అసలు రెరా అనుమతి అవసరమే లేదు" అంటూ విడ్డూరమైన సమాధానాలు చెప్పడం గమనార్హం. ఒకే సంస్థకు చెందిన రెండు కీలక విభాగాలు వినియోగదారులను ఇలా గందరగోళానికి గురిచేయడం వెనుక పెద్ద మోసమే దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
పత్రాల ప్రదర్శనకు దాగుడుమూతలు..
రెండు వైపులా చెరువులు ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల నుంచి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన నిరాక్షేపణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. "మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి" అని పైకి చెబుతున్న కాసా గ్రాండ్ ప్రతినిధులు, వాటిని ప్రదర్శించడానికి మాత్రం వెనుకాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. "ప్రస్తుతం ఆఫీసులో కాపీలు లేవు, వాట్సప్ చేస్తాం" అని చెప్పిన సిబ్బంది, ఆ తర్వాత ఫోన్ చేస్తే.. "కంపెనీ అంతర్గత పత్రాలు ఇతరులకు ఎం దుకు చూపిస్తాం.. ఇస్తాం" అంటూ మాట మార్చారు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే, ఆ పత్రాలను కొనుగోలుదారులకు, నిర్మాణ వెంచర్ పై ఆరోపణలు అనుమానాలను ప్రశ్నిస్తున్న మీడి యా ప్రతినిధులకు చూపించడానికి ఎందుకు భయపడుతున్నట్లు ?
పెద్ద చెరువు ఆక్రమణపై చర్యలేవి..?
కోతినారు చెరువు బండ్ ధ్వంసంపై కాసా గ్రాండ్ ఇల్లీగల్ గా వ్యవహరించిందని దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ధ్వంసమైన చెరువు కట్ట పునరుద్ధరణ పనులను కాసా గ్రాండ్ ప్రారంభించినట్లుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మరి కాసా గ్రాండ్ సియెరా లేఅవుట్ వెనక భాగంలో ఉన్న ఎమినిటీస్ భాగంతో పాటుగా మరికొన్ని విల్లాలు కూడా పెద్ద చెరువు యొక్క బఫర్ జోన్ ప్రాంతంలో వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఎల్ లేక్స్ లో దుండిగల్ పెద్ద చెరువు యొక్క కోఆర్డినేట్ A 32 నుంచి A 36 మధ్యలో ఈ ఆక్రమణ జరిగినట్లుగా తెలుస్తుంది. కాగా, వెంచర్ అక్రమాలపై ప్రభు త్వం కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో ఈ రెండు చెరువులు మ్యాప్‌లోనే లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమి కులు హెచ్చరిస్తున్నారు. రెండు చెరువుల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టుకు అసలు నీటిపారుదల శాఖ క్లియ రెన్స్ ఇచ్చిందా, నిబంధనలు ఉల్లంఘించలేదని చెబుతున్నప్పుడు తహశీల్దార్ స్వయంగా ఎందుకు ఫిర్యా దు చేశారు. రెరా నెంబర్ లేకుండా వందలాది కోట్ల రూపాయల విల్లాల వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కాదా, వినియోగదారుల హక్కులను కాలరాస్తూ పత్రాల దాగుడుమూతలు దేనికి సంకేతం అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.






