- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana : ఉత్కంఠకు తెర.. పురపాలికల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు
పురపాలిక ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయ్యిందో తేలిపోయింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : పురపాలిక ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయ్యిందో తేలిపోయింది. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట, ఆలియాబాద్, మూడుచింతలపల్లి మూడు మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మను చౌదరి ఖరారు చేసి, జిల్లా గెజిట్‌లో తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మున్సిపల్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎస్టీ మహిళ, ఆలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనరల్ మహిళ, మూడుచింతపల్లి మున్సిపల్ చైర్మన్‌గా ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ నెల 18న కేబినేట్ సమావేశం తర్వాత, 19 లేదా 20 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చే ఫిబ్రవరి 10 నుంచి 12 మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్ల ప్రక్రియ..
రిజర్వేషన్ల కోసం 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే ప్రకారం ఉన్న గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. వార్డుల రిజర్వేషన్ మొదట ఎస్టీ, ఎస్సీ, అనంతరం బీసీ క్రమంలో నిర్ణయించారు. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఆయా పురపాలికల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయించారు. జనాభ నిష్పత్తి ప్రకారం ఒక్క సీటు రాకపోయినా, వీరికి కనీసం ఒక వార్డును కేటాయించారు. మహిళ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల్లోని మహిళా రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50 శాతం కేటాయించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసీ మహిళలకు వార్డులను ఖరారు చేశారు.
మూడుచింతపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్లు..
క్ర.సంఖ్య వార్డు పేరు వార్డు నెంబర్ రిజర్వేషన్ పురుష/మహిళ
1 లింగాపూర్ తండా/నాగిశెట్టిపల్లి 7 ఎస్టీ జనరల్
2 కొల్తూర్ 19 ఎస్సీ జనరల్
3 ఉద్దేమర్రి 21 ఎస్సీ మహిళ
4 కోల్తూర్ 18 ఎస్సీ మహిళ
5 మూడుచింతలపల్లి 4 ఎస్సీ జనరల్
6 పొన్నాల 11 ఎస్సీ జనరల్
7 అద్రాస్‌పల్లి 23 బీసీ జనరల్
8 పొన్నాల 12 బీసీ మహిళ
9 మూడుచింతలపల్లి 6 బీసీ జనరల్
10 కేశవరం 24 బీసీ మహిళ
11 కేశవరం 20 బీసీ జనరల్
12 ఉద్దేమర్రి 8 బీసీ మహిళ
13 అనంతారం 1 జనరల్ జనరల్
14 నారాయణపూర్/పొతారం 2 జనరల్ మహిళ
15 లక్ష్మాపూర్ 3 జనరల్ మహిళ
16 లక్ష్మాపూర్ 5 జనరల్ మహిళ
17 ఉద్దేమర్రి 9 జనరల్ మహిళ
18 కేశవపూర్ 10 జనరల్ జనరల్
19 జగ్గంగూడ 13 జనరల్ జనరల్
20 జగ్గంగూడ 14 జనరల్ జనరల్
21 జగ్గంగూడ 15 జనరల్ మహిళ
22 కొల్తూర్ 16 జనరల్ మహిళ
23 కొల్తూర్ 17 జనరల్ మహిళ
24 అద్రాస్‌పల్లి 22 జనరల్ జనరల్
ఆలియాబాద్ మున్సిపాలిటీ రిజర్వేషన్లు..
క్రం.సంఖ్య వార్డు పేరు వార్డు నెం రిజర్వేషన్ పురుష/మహిళ
1 తుర్కపల్లి 1 ఎస్టీ జనరల్
2 లాల్‌గడి మలక్‌పేట 14 ఎస్సీ మహిళ
3 ఆలియాబాద్ 7 ఎస్సీ జనరల్
4 లాల్‌గడి మలక్‌పేట 6 ఎస్సీ జనరల్
5 ఆలియాబాద్ 19 బీసీ జనరల్
6 తుర్కపల్లి 3 బీసీ మహిళ
7 తుర్కపల్లి 2 బీసీ జనరల్
8 ఆలియాబాద్ 20 బీసీ మహిళ
9 ఆలియాబాద్ 18 బీసీ జనరల్
10 లాల్‌గడి మలక్‌పేట 15 బీసీ మహిళ
11 మలక్‌పేట 5 జనరల్ మహిళ
12 ఆలియాబాద్ 8 జనరల్ మహిళ
13 ఆలియాబాద్ 9 జనరల్ మహిళ
14 తుర్కపల్లి 4 జనరల్ మహిళ
15 మజీద్‌పూర్ 10 జనరల్ మహిళ
16 మజీద్‌పూర్ 11 జనరల్ మహిళ
17 యాడారం 12 జనరల్ జనరల్
18 మురాహరిపల్లి 13 జనరల్ జనరల్
19 లాల్‌గడి మలక్‌పేట 16 జనరల్ మహిళ
20 ఆలియాబాద్ 17 జనరల్ జనరల్
ఎల్లంపేట మున్సిపాలిటీ రిజర్వేషన్లు..
క్ర.సంఖ్య వార్డు నెం రిజర్వేషన్ పురుష/మహిళ
1 4 ఎస్టీ జనరల్
2 8 ఎస్టీ మహిళ
3 9 ఎస్టీ జనరల్
4 5 ఎస్టీ మహిళ
5 2 ఎస్టీ జనరల్
6 21 ఎస్సీ జనరల్
7 7 ఎస్సీ జనరల్
8 12 ఎస్సీ మహిళ
9 20 ఎస్సీ మహిళ
10 24 బీసీ మహిళ
11 17 బీసీ జనరల్
12 18 బీసీ జనరల్
13 1 జనరల్ మహిళ
14 3 జనరల్ మహిళ
15 6 జనరల్ మహిళ
16 10 జనరల్ మహిళ
17 11 జనరల్ మహిళ
18 13 జనరల్ జనరల్
19 14 జనరల్ జనరల్
20 15 జనరల్ జనరల్
21 16 జనరల్ జనరల్
22 19 జనరల్ మహిళ
23 22 జనరల్ మహిళ
24 23 జనరల్ జనరల్






