మేడ్చల్‌లో రేషన్ షాపుల పై విజిలెన్స్ ఆకస్మిక దాడులు

by Batti.Sumithra |

ప్రభుత్వ రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు మేడ్చల్ లోనీ 19,22 రేషన్ దుకాణాల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మేడ్చల్‌లో రేషన్ షాపుల పై విజిలెన్స్ ఆకస్మిక దాడులు
X

దిశ, మేడ్చల్ టౌన్ : ప్రభుత్వ రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు మేడ్చల్ లోనీ 19,22 రేషన్ దుకాణాల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రేషన్ షాపుల్లో ఉన్న బియ్యం, గోధుమలు, చక్కెర తదితర సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. అలాగే లబ్ధిదారుల వివరాలు, ఈ–పాస్ యంత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ రికార్డులను సైతం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడిన విజిలెన్స్ అధికారులు, రేషన్ సరుకులు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అన్న విషయం పై వివరాలు సేకరించారు. అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ సరుకులను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించబోమని, అవసరమైతే కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు.

Next Story