రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

by Elthuri vijay kumar |

కింద్రాబాద్ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది.

రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
X

రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

బొల్లారంలో రైలు పట్టాలు దాటుతుండగా ఘటన

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్ఖానాకు చెందిన కార్తీక్ (19), వెస్ట్ మారేడు పల్లికి చెందిన మల్లికార్జున్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, బొల్లారానికి చెందిన శివానంద్ (35) తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు కూలీలుగా పని చేస్తుండగా, గాయపడ్డ శివానంద్ మత్స్యకార వృత్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన యువకుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Next Story