- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి రింగు రోడ్డుపై శనివారం అ

దిశ, మేడ్చల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి రింగు రోడ్డుపై శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, మేడ్చల్ వైపు నుంచి శామీర్పేట వైపు రింగు రోడ్డుపై వెళ్తున్న బోర్వెల్ లారీ (ఏపీ23 బీయూ 2178) మునీరాబాద్ సమీపంలో బ్రేక్ డౌన్ అయింది. దీంతో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్, లారీని పక్కకు నిలిపాడు. డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు క్లీనర్ మచ్చ సురేశ్ మరమ్మతులు చేస్తుండగా అదే దారిలో వేగంగా వచ్చిన మరో లారీ (టీజీ07 యూబీ 5888) ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీని మరమ్మతు చేస్తున్న మచ్చ సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా గాయపడటంతో కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.






