- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చోరీలకు పాల్పడిన ఇద్దరు రిమాండ్..
కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కూకట్పల్లి పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు.

దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కూకట్పల్లి పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెళ్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన సర్దెన శ్యాంకుమార్(19), కరిమెండి మధు కుమార్ అలియాస్ మధు(20)లు చిన్న నాటి నుంచి స్నేహితులు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతుండే వారు.
ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులలో నిందితులుగా ఉన్నారు. కూకట్పల్లిలో ఇద్దరి కదలికలు గుర్తించిన బాలానగర్ సీసీఎస్ పోలీసులు, కూకట్పల్లి పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసును చేధించేందుకు కృషి చేసిన సీఐ నరసింగరావు, డీఐ ఆంజనేయులు, సీసీ పోలీసులను ఏసీపీ చంద్రశేఖర్ అభినందించారు.






