- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ పోలీసులను తప్పించబోయి..
వాహనంపై దూసుకొస్తున్న ఓ వ్యక్తి ఒకసారిగా ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని పక్కనుంచి మళ్ళించ పోయాడు.

దిశ, కూకట్ పల్లి: వాహనంపై దూసుకొస్తున్న ఓ వ్యక్తి ఒకసారిగా ట్రాఫిక్ పోలీసులను చూసి వాహనాన్ని పక్కనుంచి మళ్ళించ పోయాడు. ఈ క్రమంలో ఆ వాహనం అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాపూర్ నగర్ లో నివాసం ఉంటూ కార్పెంటర్ గా పనిచేస్తున్న జోష్ బాబు (35) ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాలనగర్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఐడీపీలు కాలనీ గేటు వద్ద బాలనగర్ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఐడిపిఎల్ సిగ్నల్ దాటి దూసుకు వస్తున్న జోష్ బాబు అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులను చూసి తన ద్విచక్ర వాహనాన్ని కట్ కొట్టి పక్కనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో సరిగ్గా అటు నుంచి బాలనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టి దాని కింద పడ్డాడు. బస్సు అతను పైనుంచి వెళ్లడంతో జోష్ బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వల్లనే నిండు ప్రాణం బలైందని స్థానికులు, వాహనదారులు ఆరోపించారు. కాగా బాలానగర్ పోలీసులు వాహనదారులపై లాఠీచార్జ్ చేశారని దీని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






