- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మకం, సేవలకు కొత్త చిరునామా.. యాదాద్రి కో-ఆప్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పీర్జాదిగూడ, బుద్ధానగర్ రోడ్ నెం.1లో యాదాద్రి కో-ఆప్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శుక్రవారం ఘనంగా ప్రారంభించబడింది.

దిశ, మేడిపల్లి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పీర్జాదిగూడ, బుద్ధానగర్ రోడ్ నెం.1లో యాదాద్రి కో-ఆప్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శుక్రవారం ఘనంగా ప్రారంభించబడింది. ప్రజలకు విశ్వసనీయ ఆర్థిక సేవలు, భద్రమైన పెట్టుబడులు సహకార స్ఫూర్తితో ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై సంస్థను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కార్పొరేటర్ నవీన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, మదుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి,గందే విశ్వం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.బ్యాంకు సీఈవో గొలనుకొండ రాంబాబు,చైర్మన్ బచ్చు శ్రీనివాస్,డైరెక్టర్లు స్థానిక నాయకులు, ప్రముఖులు, అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.






