- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడికి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్..
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గృహ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

దిశ, అల్వాల్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గృహ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మేదిశెట్టి శ్యామ్‌రావు దంపతులు జూన్ 3న తమ ఇంటికి తాళం వేసి మెదక్‌కు వెళ్లగా, జూన్ 27న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు, అల్మారా పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
పోలీసులు కీలక సూచనలు
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు (38) ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు తేలింది. అనంతరం దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను పాపనీ రాజు (45), మైలారం మహేష్ చారి (46)లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు మల్కాజిగిరి ఏసీపి గోపాలకృష్ణ బేగంపేట ఏసీపీ పి. గోపాల కృష్ణమూర్తి, అల్వాల్ ఎస్‌హెచ్‌వో ఎ. ప్రశాంత్ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె. వీరబాబు, ఎస్‌ఐలు కె. చంద్రశేఖర్, ఎ. మల్లేష్, క్రైమ్ సిబ్బంది ఛేదించారు. ఈ సందర్భంగా డీసీపీ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, గృహ సేవకులు, వాచ్‌మెన్ల వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.






