మీ సేవా కేంద్రాలలో దళారుల దందా!

by velandi.Saikiran |

మీ సేవ కేంద్రా లు అక్రమ దందాకు అడ్డగా మారా యి. కేంద్రాల నిర్వహకులు దళారులతో కుమ్మక్కై సామాన్య ప్రజలను దోసుకుంటున్నారు.

మీ సేవా కేంద్రాలలో  దళారుల దందా!
X

మీ సేవా కేంద్రాలలో దళారుల దందా!

-ఏసీబీ తనిఖీల్లో బయట పడ్డ విస్తుపోయే నిజాలు

-నిబంధనలకు నీళ్లు.. అధిక వసూళ్లు

దిశ, మేడ్చల్ బ్యూరో: మీ సేవ కేంద్రా లు అక్రమ దందాకు అడ్డగా మారా యి. కేంద్రాల నిర్వహకులు దళారులతో కుమ్మక్కై సామాన్య ప్రజలను దోసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ సేవలకు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. తెలం గాణ వ్యాప్తంగా 13 మీ సేవా కేం ద్రాలపై ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో.. అక్కడ జరుగుతున్న అవి నీతి అక్రమాల చిట్టా చూసి అధికారులు నివ్వెర పోయారు. నగరంలో ని అల్వాల్, సరూర్ నగర్, తర్నాక, అంబర్‌పేట, ఖైరతాబాద్, న్యూ మల్లేపల్లిలోని మీ సేవా కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ప్రభుత్వం తరఫు నుంచి పౌరులకు జారీ చేయాల్సిన ధృవ పత్రాల విష యంలో పెద్ద ఎత్తున అక్రమాలకు జరుగుతున్నాయని ఫిర్యాదులతో ఏసీబీ యాక్షన్ లోకి దిగింది.

యూపీఐ ద్వారా లావాదేవీలు..

మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దళారులతో కుమ్మక్కై.. వివిధ పను ల కోసం వచ్చే ప్రజల నుంచి మూ డింతల చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మధ్య వర్తులు, అధికారుల మధ్య జరిగిన వాట్సాప్ చాటిం గ్స్ బయట పడడంతోపాటు లంచా ల వ్యవహారం అంతా యూపీఐ లావాదేవీల ద్వారా సాగుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ మొ త్తంలో వసూలు చేస్తూ సామాన్యులను దోసుకుంటున్నా తీరు తనిఖీ ల్లో బయటపడింది. సాధారణ ప్రజ లకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలను అందకుండా చేస్తున్నారనిగుర్తించారు. దళారుల ద్వారా మీ సేవ నిర్వహకులు సిబ్బంది కలిసి చక్రం తిప్పుతున్నట్లు దర్యాప్తులో గు ర్తించారు. కులం, ఆదాయం, నివా సం ధృవీకరణ పత్రాల కోసం ప్రభు త్వం నిర్ణయించిన ఫీజుకంటే ఎక్కు వ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఏసీబీ తేల్చింది. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల్లోనూ చేతివా తం ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు. రవాణా శాఖకు సంబంధించిన స్లాట్లు, లైసెన్సులు, బీమా తదితర పనుల్లో కేంద్రాల నిర్వహకులు దళారులతో చేతులు కలిపారు. లేబర్ కార్డు కోసం దరఖాస్తుదారుల నుం చి ఒక్కో కార్డుకు రూ. వేలల్లో వసూ లు చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులో పేరు, చిరునామా మార్చేం దుకు రూ.200 నుంచి రూ.300 వరకు గురుకులాల్లో ప్రవేశాలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తెప్పిస్తామంటూ రూ.వేలల్లో డబ్బు లు వసూలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు సోదాల సమయంలో మీ సేవ సెంటర్లలో ఉన్న నగదు నిల్వ లు, పెండింగ్ దరఖాస్తుల లిస్ట్ ,మీ సేవ సిబ్బంది వ్యక్తిగత వివరాలను కూడా పూర్తిగా పరిశీలించారు.

మీ సేవా కేంద్రాల్లో అక్రమ దందా..

అల్వాల్ మీ సేవా కేంద్రంలో ఖాళీ అటెస్టెడ్ సర్టిఫికెట్లు, ముందస్తు గా సంతకాలు చేసిన నోటరీ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ డాక్యుమెంట్ల తయారీకి ఇక్కడ భారీ స్కెచ్ వేసినట్లు తేలింది. ఇకపోతే సరూర్ నగర్ లో అయితే ఒకే కేంద్రంలో డబుల్ లాగిన్ ఐడీలు వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ కూడా భారీ బ్లాంక్ నోటరీ పేపర్లు బయటపడ్డాయి. తార్నాకలో నోటరీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే.. ఖమ్మం కేంద్రం లో ఏకంగా అనాధికార వ్యక్తులే ప్రభుత్వ సర్టిఫికేట్లపై సంతకాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డిలో స్టాంప్ పేపర్ల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోగా, సూర్యాపేటలో ఇతర కేంద్రా లకు సంబంధించిన సర్టిఫికేట్లను గుర్తించారు. ప్రజలకు అందజేయాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను డెలివరీ చేయకుండా తమ వద్దే ఉంచుకొని డబ్బుల కోసం వేధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

Next Story