- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బౌరంపేటలో రెండు ఇళ్లల్లో చోరీ..
వరుస దొంగతనాలతో శివారు ప్రాంతాల్లో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

దిశ, దుండిగల్: వరుస దొంగతనాలతో శివారు ప్రాంతాల్లో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగు నెలల క్రితం బౌరంపేట గ్రామంలో గోల్డ్ షాప్ పక్క షెట్లర్ లో పక్కా స్కెచ్ తో టెంపర్వరీగా అద్దెకు తీసుకున్న దుండగులు రాత్రికి రాత్రి బంగారు, వెండి నగలు భారీగా దోచుకెళ్లి పోలీస్ లకు సవాల్‌గా విసిరిన సంఘటన మరువక ముందే అదే బౌరంపేట గ్రామంలో గురువారం తెల్లవారు జామున రెండు ఇళ్లలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పోచమ్మ ఆలయం దగ్గర నివాసం ఉంటున్న లద్దిపీర్ల భూమయ్య గౌడ్ తన పిల్ల స్కూల్ ఫీజుల కోసం ఒక లక్ష్య 30 వేల రూపాయల నగదు ఇంట్లో నిల్వ ఉంచాడు.
మరో ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా..
అదే గ్రాములో ఓ చిరు ఉద్యోగి నిరుడు రవి ఇంటి కిరాయి నిమిత్తం, ద్వాక్రా సొమ్ము చెల్లించేందుకు ఇంట్లో 35 వేల రూపాయలు నగదు ఉంచుకున్నాడు. గురువారం తెల్లవారుజామున రెండు ఇళ్లలోకి చొరబడిన దుండగుడు రవి ఇంట్లో 3 తులాల ఐదు గ్రాముల బంగారు నగలు, 35 వేల నగదుతో పాటు, భూమయ్య ఇంట్లో లక్ష్యా 30 వేల నగదు అపహరించినట్లు సమాచారం. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పక్కనే ఉన్న మరో ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. అలికడి కారణంగా కుక్కలు మొరగడంతో దుండగుడు పరారైనట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు విఫలం అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో గట్టి నిఘా పెంచాలని ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది. బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.






