- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిలుకానగర్ లో చోరీ.. 5 తులాల బంగారం, నగదు అపహరణ
చిలుకానగర్ లో చోరీ జరిగిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, ఉప్పల్ : చిలుకానగర్ లో చోరీ జరిగిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిలుకానగర్ లో నివసిస్తున్న మహ్మద్ అన్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూన్ 4న తారీఖున భువనగిరి సమీపంలోని అనజిపురం గ్రామానికి వెళ్లి, జూన్ 8న ఉదయం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోని అల్మారాను తెరిచి చూడగా సుమారు 5 తులాల బంగారు పుస్తెలతాడు, చెవి రింగులు, మెట్టిళ్లుతో పాటు స్టీల్ బాక్స్‌లో ఉంచిన నగదు కనిపించలేదు. గ్రామానికి వెళ్లే తొందరలో అల్మారాకు సరిగా తాళం వేయకపోవడంతో పాటు తాళాలు కూడా అల్మారాలోనే ఉంచినట్టు బాధితుడు తెలిపాడు. వంటగది కిటికీకి లోపలి గ్రిల్స్ లేకపోవడంతో, అదే మార్గంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






