- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి...పాఠశాలలో చోరీ
by velandi.Saikiran |
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దుండగులు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్ళారు.

X
దిశ, జవహర్ నగర్ : సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దుండగులు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరికి పాల్పడి వైరింగ్, ప్లంబింగ్ వస్తువులను దొంగిలించారు. సుమారు 30వేల విలువ చేసే సామగ్రిని ఎత్తుకుపోయారని ప్రధానోపాధ్యాయుడు ఆజామోహినుద్ధిన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story






