ప్రేమ వివాహం చేసుకున్నారని.. అబ్బాయి ఇంటి పై అమ్మాయి బంధువులు దాడి

by Ratna Kumari |

ప్రేమ వివాహం చేసుకున్నారని అబ్బాయి ఇంటి పై అమ్మాయి బంధువులు దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ వివాహం చేసుకున్నారని.. అబ్బాయి ఇంటి పై అమ్మాయి బంధువులు దాడి
X

దిశ, మేడిపల్లి : ప్రేమ వివాహం చేసుకున్నారని అబ్బాయి ఇంటి పై అమ్మాయి బంధువులు దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బోడుప్పల్ కు చెందిన ఉరటి కృష్ణ కుమారుడు వాసు, కొర్రెములకు చెందిన ముంత పూజ(25)ని ప్రేమించి బుధవారం లాలాగూడ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. గురువారం యువతి కుటుంబసభ్యులు కృష్ణ ఇంటిలోకి చొరబడి మొత్తం సామాన్లు ధ్వంసం చేశారు. కొద్ది రోజుల్లో మిమ్మల్ని చంపేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా తన తల్లి తరఫు కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని పెళ్లి చేసుకున్న రోజే యువతి మేడిపల్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సందర్భంగా పెళ్లికొడుకు బాబాయ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో దాడి పై పిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story