వాడవాడలా గులాబీ జెండా రెపరెపలు..

by Disha Web Desk 11 |
వాడవాడలా గులాబీ జెండా రెపరెపలు..
X

దిశ, దుండిగల్: కుత్భుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. దుండిగల్ మున్సిపాలిటీ శంభిపూర్ గ్రామంలోని ఎమ్మెల్సీ కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. దుండిగల్ మున్సిపాలిటీ 26 వ వార్డులో శంభీపూర్ కృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కొంపల్లి మున్సిపాలిటీలో జరిగిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ సాధనకోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed